కమలాపురం సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి చంద్ర
కడప సిటీ :ఉమ్మడి కుటమి సిపిఐ ఎమ్మెల్యేఅభ్యర్థి గాలి చంద్ర మాట్లాడుతూ వరదల వల్ల గతంలో తెగిపోయిన కమలాపురం బ్రిడ్జి కి ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి నిర్మిస్తున్న కాంట్రాక్టర్ బ్రిడ్జి రివిట్మెంట్ నిర్మాణానికి అవసరమైన మట్టి, రాళ్లు వేరే దగ్గర్నుంచి తీసుకురావాటం మానేసి ఖర్చులు తగ్గించుకునే విధానంలో ప్రభుత్వము పాలకుల యొక్క కళ్ళుగప్పి ఎటువంటి అనుమతులు లేకుండా కొత్త బ్రిడ్జికి దగ్గరలో ఉన్నటువంటి పాత బ్రిడ్జి రాళ్లు మట్టిని తవ్వి తోలుతున్నాడని దీనివల్ల భవిష్యత్తులో భూమి కోతకు గురై, పంట పొలాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని కమలాపురం సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాలంటే డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డి పి ఆర్) అంచనా వ్యయం ప్రాతిపదికగా ప్రభుత్వం టెండర్లు పిలుస్తుందని, కాంట్రాక్టర్లు పోటీపడి పనులు దక్కించుకొని నిర్మాణం చేపడతారని, నిర్మాణం జరిగే క్రమంలో అధికారుల పర్యవేక్షణ చాలా కీలకమైంది. కానీ కమలాపురం బ్రిడ్జి నిర్మాణంలో అది కనిపించడం లేదని వారు ఆరోపించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.