ఏలేశ్వరం:-కాంగ్రెస్ పార్టీకి తన పదవులకు రాజీనామా చేసి 24 గంటలు గడవకముందే కమలం గూటికి చేరిన ఉమ్మిడి వెంకటరావు. ప్రత్తిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ కిసాన్ సెల్ కోఆపరేటివ్ నెంబర్ ఉమ్మిడి వెంకటరావు తన పదవులకు సోమవారం రాజీనామా సమర్పించారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు
దగ్గుపాటి పురంధేశ్వరి చేతుల మీదుగా కండువా కప్పుని బిజెపి గూటికి చేరారు. ఈ సందర్భంగా ఉమ్మిడి మాట్లాడుతూ భారత దేశం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డ చేస్తునటువంటి అభివృధి కార్యక్రమాలను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో దగ్గుపాటి పురంధేశ్వరి, కాకినాడ జిల్లా లో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ చేస్తునటువంటి ప్రజా సేవ ను చూసి ఆకర్షితులై భారతీయ జనత పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు.