కడప బ్యూరో:కడప నగరంలో ప్రజలు సోదర భావంతో కలసిమెలసి ప్రశాంతంగా జీవిస్తున్నారని కానీ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉద్దేశపూర్వకంగా ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నారని టీటీడీ పాలకమండలి సభ్యులు మాసీమ బాబు హితవు పలికారు. గురువారం కడప వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్లతో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కార్పొరేటర్ కమల్ బాషా కుమారుడి పై కత్తితో దాడి చేస్తే చూస్తూ కూర్చోవాలా..2 టౌన్ పోలీస్ స్టేషన్ లో హంగామా చేసింది టీడీపీ నేతలు కాదా అంటూ ప్రశ్నించారు.
ఈ గొడవ ను ఆసరాగా తీసుకుని టీడీపి నేతలు హిందు ముస్లింల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కడప ప్రజలు సోదర భావంతో కలసి మెలసి ఉంటారు. టీడీపీ ఇంచార్జ్ మాధవి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి కి క్షమాపణలు చెబుతున్నా. డిప్యూటీ సీఎం అంజాద్ బాష ప్రజల మనిషి.. అందరి వాడు. సామాన్యునికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అంజాద్ బాషా ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ప్రజలకు న్యాయం జరిగి ఉంటేనే ఓటు వేయాలని అడిగే ఏకైక సీఎం జగన్. కానీ టిడిపి అధినేత చంద్రబాబు ప్రజలకు ఎం చేసాడో చెప్పి ఓటు అడగగలడా అంటూ ప్రశ్నించారు.
దయచేసి కులాలు, మతాలు మధ్య గొడవలు పెట్టవద్దని ఆయన మరోసారి వేడుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు సూర్యనారాయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.