ముదిగుబ్బ
ముదిగుబ్బ మండలంలో మంగళవారం వ్యవసాయశాఖ, గణాంకశాఖ అధికారుల ఆధ్వర్యంలో కంది పంటకోత ప్రయోగాలను నిర్వహించారు. మండలపరిధిలోని గుంజేపల్లి గ్రామంలో ఓబులప్ప అనురైతు పొలంనందు కంది పంటను 10మీటర్లు పొడవు 10మీటర్లు వెడల్పు విస్తీర్ణంలో కోతకోసి నిర్వహించిన ప్రయోగంలో 690 గ్రాముల దిగుబడి వచ్చినట్లు అధికారులు ధ్రువీకరిస్తూ ఈమేరకు ఎకరాకు 34.5 కేజీల దిగుబడి రానున్నట్లు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా దొరిగల్లు గ్రామంలో మహిళారైతు బొజ్జమ్మ పొలంనందు కంది పంటకోత ప్రయోగం నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా అర్థ గణాంకశాఖ అధికారి విజయకుమార్, మండల వ్యవసాయశాఖ అధికారి లక్ష్మీనరసింహులు, మండల సహాయ గణాంకఅధికారి మాదినేని చంద్రశేఖర్, మండల వ్యవసాయవిస్తరణ అధికారి షర్ఫుద్దీన్, గ్రామవ్యవసాయ సహాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

