కనిగిరి
కేంద్రం ప్రవేశపెట్టిన ఒక దేశం ఒక విద్యార్ది ఐ.డి. కార్డు ఆపార్ కార్డు యొక్క లక్ష్యాలు, ఆశయాలు మరియు విద్యార్ధుల స్వచ్చంద సమాచార గోప్యతపై ప్రభుత్వ చర్యలు గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు యం.పి. మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయక మంత్రి సుభాస్ సర్కార్ మాట్లాడుతూ దేశంలోని విద్యార్ధులకు ప్రత్యేక గుర్తింపు కార్డు సంఖ్య యిచ్చేముఖ్య ఉద్దేశ్యంతో కేంద్రం ప్రారంభించిందే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 యని, దేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలలోని విద్యార్ధుల అకడమిక్ జర్నీ, విధ్యా ప్రయాణం మరియు విజయాలను జీవితకాలం నమోదు చేసేదే “ఒక దేశం ఒక విద్యార్ది ఐ.డి. కార్డు” లేక ”ఆపార్ కార్డని మరియు సంపూర్ణ -బహుళ క్రమశిక్షణతో కూడిన విధ్య, అన్ని స్థాయిలలో సర్వముతో సమాన విధ్య కలుగజేయడం మరియు జీవితకాలం నేర్చుకొనే పర్యావరణ వ్యవస్థ కల్పన దీని ముఖ్య లక్ష్యాలని తెలిపారు.ఈ లక్ష్యాల సాధనలో విద్యార్ధుల మరియు అభ్యాసకుల జీవితకాల విధ్య మరియు నైపుణ్య ప్రయాణం తెలుసుకొనుటకు – ప్రతి విషయాన్ని గుర్తించుటకు నియమాలు సేకరణ మరియు నమోదు అవసరమని తెలిపారు. దీని వలన ఒక విధ్యా సంస్థ నుండి పలు సంస్థలకు సామర్ధ్య మరియు విద్యార్ధుల బదిలీలకు వీలు కలగడంతో పాటు నైపుణ్య భాగం, ఎంపిక ఆదార కోర్సులు, ప్రణాళిక – పాట్యాంశాల మెరుగుదల అంశాలతో అన్ని కార్యక్రమాల అనుసంధానికి వీలుకలుగునని మరియు తల్లితండ్రులు ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ఈ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడంజరిగిందని కేంద్ర మంత్రి ఎంపీ తెలియజేశారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు.