హిందూపురంటౌన్ :రానున్న ఎన్నికల్లో అందరం కలిసి హిందూపురంలో వైసిపి జెండాను ఎగుర వేసి చరిత్రను తిరగరాద్దామని మైనార్టీ నాయకులు అన్నారు. సోమవారం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో వైసిపి నాయకులు వేణురెడ్డి మైనార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులు శాంతమ్మ దీపికలను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ జబీవుల్లా, మాజీ ముతవల్లి కలీం, చాంద్ భాష తదితరులు పాల్గొన్నారు.