Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం మహాసభలు జయప్రదం చేయండి

ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం మహాసభలు జయప్రదం చేయండి

పోరుమామిళ్ల
భవన నిర్మాణ జిల్లా ఐదవ మహాసభ కరపత్రాలు గురువారం విడుదల చేశారు ఈ సందర్భంగా పోరుమామిళ్ల పట్టణంలోని సుందరయ్య కాలనీ, తిరుపతి కాలనీలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రమేశ్, ఏఐటీయూసీ మండల అధ్యక్ష కార్యదర్శులు సఫా, పిరయ్య లు మాట్లాడుతూ 2018 నుంచి ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నటువంటి. క్లెయిమ్ వెంటనే విడుదల చేయాలని .ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడినప్పటినుంచి భవన నిర్మాణ కార్మికుల ను చిన్న చూపు చూడడమే కాకుండా సంక్షేమ బోర్డు నిర్వరం చేయడం జరిగింది. జీవో నెంబర్17 ద్వారా కొట్లాది రూపాయలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాడుకోవడం జరిగింది. మరోపక్కకరోనా వచ్చి భవన నిర్మాణరంగం కుదెలు అయిపోయి కార్మికులు కుటుంబాలు గడవక పనులు లేక ఇంటి అద్దె కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కార్మికులం ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి కష్టాన్ని మరింత కష్టంగా వృద్ధి చేసింది. మరోపక్క ఇసుక లేక సిమెంట్ స్టిల్ గృహ నిర్మాణ రా మెటీరియల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1996 చట్టాన్ని గౌరవించి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సంక్షేమ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వాడాలని లేనిపక్షంలో భవన నిర్మాణ కార్మికులను ఏకం చేసి ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ బోర్డు కాపాడుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. పొద్దుటూరులో జరిగే భవన నిర్మాణ జిల్లా 5 వ మహాసభలు జయప్రదం చేయాలని వారు కార్మికులకు సిద్ధం కావాలని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు .ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల సహాయ కార్యదర్శి కేశవ, వెంకటేశ్వర్లు, బెల్లం బాషా, రమణయ్య, నారాయణ, రమణ, యాకోబు, జయన్న, నరసింహులు, కల్పనా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article