*ప్రభుత్వమొక్కటే పరిపాలన లో పొరపెచ్చులు..!
*ఉపముఖ్యమంత్రి పిర్యాదు చేస్తే…
*ఉప సభాపతి అవన్నీ ఉత్తుత్తి కావచ్చేమో అంటున్నారు…
*హోంమంత్రి మాకు లేని ఇబ్బంది మీకేల అంటారు…
*గోదావరి జిల్లాలలో పేకాట ఊపిరినిస్తుందట..
*కానీ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది..
*ఉక్కుపాదం మోపితే ఉపముఖ్యమంత్రి ఉగ్రరూపం దాల్చడం వెనుక…?
*కూటమిలో వేరు కుంపట్లు ఉన్నాయా…?
*భీమవరం డిఎస్పీ వ్యవహారం పై భిన్న వాదనలకు…!
*డిజిపి నివేదిక ఇస్తారా…నిలుపుదల చేస్తారా..
*పవనిజం లో పొరపాట్లు దొర్లుతున్నాయా…
*జనసైనికులలో అభ్యంతరాలకు అడ్డుకట్ట పడ్డట్లేనా..?
*పవనిజమా…రఘురాముడి నిజమా…!
*పోలీసులకు సవాల్ గా మారిన పేకముక్కల కథ..
(రామమోహన్ రెడ్డి)
ఏది నిజం…ఎవరిది నిజం అంటే అందుకు మౌనమే సమాధానం చెబుతుంది. ఓకే ప్రబుత్వం లో ఉన్న పెద్దలు ఒక సమస్య పై భిన్న స్వరాలు వ్యక్తపరుస్తున్న నేపద్యంలో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతాయన్నది సహజం. సాధారణంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక సమస్యపై విభిన్న రీతిలో స్పందించటం పరిపాటి.కానీ స్వపక్షంలో నే విపక్షాల లాగా వేరు వేరు వాదనలు బైటికి వచ్చినప్పుడు ప్రజల్లో ఒకింత ఆలోచన ధోరణి మారుతుందనేది బహిరంగ సత్యం. అంటే స్వపక్షం అన్నది బాహ్య ప్రపంచంలో బాగా ఉన్నా అంతర్లీనంగా అనేక అపోహలు ఉన్నాయనేది స్పష్టం అవుతోందని చెప్పాలి.సాధారణంగా ఓకే పార్టీకి చెందిన వారు ప్రభుత్వం లో ఉంటే స్వపక్షంలో విపక్ష ధోరణి ఉన్నా వారి భావాలు బహిరంగ పరచాలంటే కొంత అడ్డుకట్ట అడ్డుగా వస్తుంది.కానీ నవ్యాంధ్రప్రదేశ్ లో సమర్థవంతమైన, పరిపాలన దక్షత కలిగి,ఏ విషయంలో నైనా మేదో మథనం చేసి ముందుకు వెళ్లే దార్శనికత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నా కూటమి గా ఉండటం మూలాన కూటమి లో ఉన్న కింది స్థాయి నాయకులు, కార్యకర్తలలో లోపిస్తున్న సమన్వయంతో సమస్యల పరిష్కారం లో కొంత ఇబ్బంది కర వాతావరణం ఉందనే అపోహలు తలెత్తుతున్నాయి.ఇప్పుడు అలాంటిదే నేటి భీమవరం డీఎస్పీ వ్యవహారం కాబోలు.
జూదం అంటే డబ్బు లేదా ఇతర విలువైన వస్తువులను లాభం పొందే ఆలోచనతో ఫలితం ఏమిటో కచ్చితంగా తెలియని ఏదైనా ఆటలో నియోగించడం. సాధారణంగా ఈ ఆట ఫలితం కొద్ది సమయంలోనే వెల్లడి చేయబడుతుంది.అయితే ఈ జూదం అనేక కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తుంది అందుకే ప్రభుత్వాలు ఈ క్రీడ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు.కానీ భీమవరం ,గోదావరి జిల్లాల్లో పేకాట పదమూడు ముక్కలాట అనేది ఒక సరదాగా నిత్యం ఆడుతూ ఉంటారన్నది బహిరంగ సత్యం. ఆ జిల్లా వాసులు రాజకీయ పార్టీలతో సంబందం లేకుండా వారి మానసిక పునరుత్తేజానికి ఈ ఆటను ఎంచుకుంటారు. ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్నా డబ్బున్న వారి సరదాకు ఏవి అడ్డురావు.ఎటొచ్చి పేదవాడికే అన్ని చట్టాలు అనేది నానాటి నుండి నేటి వరకు జరుగుతున్న తీరు.అయితే ఇక్కడ ప్రధానంగా ఆలోచింప చేస్తున్న విషయమే అచ్చర్యానికి గురి చేస్తుంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలలో పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం పరపాటిగా మారిందనే విషయాలు చర్చల్లో నడుస్తున్నాయి.పిఠాపురం లో జనసైనికులకు టీడీపీ కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదం కావచ్చు.. ఆయన ఏజెన్సీ పర్యటన లో భద్రతా వైఫల్యం ఇలా సంఘటనలు అనేకం చోటు చేసుకున్న పవన్ కోపం టీ కప్పులో తుఫాన్ లాంటిదన్న సద్విమర్స కూడా లేకపోలేదు.అయితే ఇక్కడ భీమవరం డీఎస్పీ విషయం లో ఉపముఖ్యమంత్రి హోదాలో ఆగ్రహం వ్యక్తం చేస్తే ఉపసభాపతి రఘురామ చాలా నింపాదిగా మీడియా సమావేశంలో రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు,అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తో కలిసి భీమవరం డీఎస్పీ వ్యవహారం కు ముగింపు పలకడం చక్కటి పరిణామంగ కూటమి నేతలు భావిస్తున్న ప్రతిపక్ష పార్టీల నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొక తప్పడం లేదు.పదమూడు ఆకుల పేక ముక్కల కథకు తాత్కాలిక ముగింపు పడినట్లయింది.

