కామవరపుకోట
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో
రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగ వారి సమర్పణలో జిల్లాలోని ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ మరియు నిర్మూలనకై తీసుకోవలసిన జాగ్రత్తలు హెచ్ఐవి ఎలా వస్తుందో ఎలా రాదు అనే విషయాలపై అవగాహన కొరకు హెచ్ఐవి నిర్ధారణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు అర్బన్ హెల్త్ కేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఐసిటిసి సెంటర్స్ కి వెళ్లి రక్త పరీక్ష చేయించుకోవాలని ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే సిడి ఫోర్ కౌంట్ తో సంబంధం లేకుండా ఏఆర్టి మందులు వాడాలని
1097 టోల్ ఫ్రీ నెంబర్,హెచ్ఐవి 2017 యాక్ట్,ఎన్ ఎ సి ఓ యాప్ డౌన్లోడ్ రక్త దానం చేయవలసిన అవసరం, దాని వల్ల కలిగే లాభాలు పి పి టి సి టి సెంటర్స్ అలాగే టీబీ మరియు క్షయ వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై శిక్షణ పొందిన కళాకారులు వీధి నాటిక ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాటల ద్వారా నాటికల ద్వారా హాస్యపు సన్నివేశాలతో తమ ప్రదర్శన చేసి ఉన్నారు.

ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న కళాకారులు
ఎం కుమార్,ఎం తిరుపతి,వీ రమేష్,వి రాజేష్,ఎం సాయి,వి వాణి కామవరపుకోట స్థానిక బస్టాండ్ సెంటర్ నందు ఈరోజు కళా జాత కార్యక్రమం జరిగి ఉన్నది .ఈ కార్యక్రమంలో స్థానిక రైట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కూడా పాలుపంచుకుని ఉన్నారు.