లేపాక్షి :మండల పరిధిలోని బయన్నపల్లి గ్రామంలో బాలకృష్ణ చిత్ర పటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తాభిషేకం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారమప్ప ,రవి ,నాగరాజు, నరేష్, చంద్ర ,తిప్పారెడ్డి, లక్ష్మీనారాయణ, రామాంజి తదితరులు ఆదివారం హిందూపురం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా మూడోసారి ఎంపికైన బాలకృష్ణ చిత్రపటానికి రక్త అభిషేకం నిర్వహించారు. ఉదయం పొట్టేళ్లను నరికి రక్తాన్ని నందమూరి బాలకృష్ణ చిత్రపటానికి అర్పించారు. మండల వ్యాప్తంగా పదుల సంఖ్యలో పొట్టేళ్లు, మేకపోతులను ఎన్టీఆర్ విగ్రహానికి ,బాలకృష్ణ చిత్రపటానికి బలి ఇచ్చారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైంది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా హింసించినట్టు పలువురు టిడిపి నేతలు పేర్కొన్నారు అయితే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ,బిజెపి ఒక త్రాటి పైకి రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మట్టి కరపించామని పలువురు టిడిపి నేతలు పేర్కొన్నారు. అన్నింటికీ మించి సంక్షేమ పథకాల అమలులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. అదేవిధంగా మండల కేంద్రమైన లేపాక్షిలో టిడిపి మండల కన్వీనర్ జయప్ప నాయకులు ఆనంద్ కుమార్ ,వెచ్చం రవీంద్రనాథ్, సూర్య ప్రకాష్ ,ప్రభాకర్ రెడ్డి, చిన్న ఓబన్న తదితరులు గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు .అనంతరం కన్వీనర్ జయప్పమాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీ సాధించిందన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 100% నెరవేరుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్షావలి, డైరీ శ్రీరామప్ప, ఎన్బికె మూర్తి,బుల్లెట్ రవి, ఆదినారాయణ లతోపాటు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా గలిబిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సీటి ఆంజనేయులు నరసింహారెడ్డి తదితరులు ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించి నందమూరి బాలకృష్ణ విజయానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
