పోరుమామిళ్ళ :తెలుగుదేశం, జనసేన, బిజెపి, కలిసిన కూటమి సునామీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోయిందని జనసేన నాయకుడు శీలంశెట్టి లక్ష్మయ్య పేర్కొన్నారు. గురువారం కువైట్లో లక్ష్మయ్య తన స్నేహితులతో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వైసిపి దుర్మార్గపు పరిపాలనను ప్రజలు సమాధి కట్టారని ప్రతిసారి బటన్ నొక్కి సొంత డబ్బు ఇచ్చినట్లు ఫీల్ అయిన జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్న నినాదం తుడిచి పెట్టుకుని పోయేలా 175 సీట్లకు164 సీట్లు టిడిపి,ఎన్డీఏ కూటమికి బహుమతిగా అందజేసిన ప్రజలు చివరికి వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారని ఆయన అన్నారు కూటమి విజయంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని పేర్కొన్నారు.