ఒంటిమిట్ట:
రాజంపేట నియోజకవర్గ జరగబోవు ఎన్నికల్లోఎన్ డి ఏ కూటమికి మద్దతు ఇవ్వండి తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట నియోజకవర్గ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం గారిని భారీ మెజార్టీతో గెలిపించండి అని టిడిపి నాయకులు సాలబాధ బుజ్జి అన్నారు,బుధవారం నాడు ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ సుగువాసి శ్రీనివాసులు తో కలిసి గ్రామంలో గడప గడపకు తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగువాసి బాలసుబ్రమణ్యం గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు,ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ గడచిన ఐదు సంవత్సరాలలో వైసిపి పాలనలో చెత్త పన్ను లాంటి అనేక పన్నులు కట్టలేక ప్రజలు అష్ట కష్టాలు పడ్డారని ఈ కష్టాలు తొలగాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఎన్డిఏ అభ్యర్థులను గెలిపించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు,ముఖ్యమంత్రి ఆయన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీ పై చేసి నిరుద్యోగ సమస్య తీర్చేందుకు సిద్ధంగా ఉన్నారని అలాగే వృద్ధాప్య పింఛన్లు మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితం బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మహిళకు ప్రతినెల 1500 ఆర్థిక సహాయం వృద్ధులకు 4000 పింఛన్ పెంపు ఇలాంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలకు టిడిపి ప్రభుత్వం చేపడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్ ఎస్సీ రమణ, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, వినోద్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, కత్తి అయవారయ్య, రహమతుల్లా, చావు సేల్, శేషారెడ్డి,రోశయ్య, పత్తి సుబ్బరాయుడు, బాబయ్య, టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

