లేపాక్షి :- మండల పరిధిలో చోళ సముద్రం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సుధామణి ఆధ్వర్యంలో 8వ తరగతి విద్యార్థులకు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నారాయణస్వామి ట్యాబ్లను పంపిణీ చేశారు. 84 మంది విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ నారాయణస్వామి మాట్లాడుతూ, ఆధునిక బోధనా పద్ధతుల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా బోధన చేసేందుకు పంపిణీ చేస్తున్న ట్యాబ్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టాబ్లను ఉపయోగించి విద్యను అభ్యసించడం విద్యార్థులకు చాలా సులభతరమైందన్నారు. బైజుస్ కంపెనీ నేతృత్వంలో పాఠ్యాంశాలను సూక్ష్మీకరించి టాబ్లకు అనుసంధానం చేసి విద్యార్థులకు అందజేయడం ప్రశంసనీయమన్నారు. ఎనిమిదో తరగతి నుండి విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానాన్ని కలిగించేందుకు ఈ ట్యాబ్లు ఉపయోగకరంగా ఉన్నట్లు కన్వీనర్ తెలిపారు. ప్రతి విద్యార్థి ఇకపై ట్యాబ్ లతోనే విద్యాభ్యసనం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.