మార్కాపురం :పొదిలి మండలంలోని కంబాలపాడు గ్రామం లోని ” ఇంటింటికి మన కందుల ” ఎన్నికల ప్రచారం మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందుల నారాయణ రెడ్డి కుమార్తె కందుల నందిని రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ని మరియు ఒంగోలు పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండలం తెలుగుదేశం నాయకులు మరియు కంబాలపాడు పంచాయతీ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.