గండేపల్లి .
గండేపల్లి మండలం ఉప్పలపాడు లో వైసీపీకి కోల్కోలేని భారీ షాక్ తగిలింది. వైయస్సార్ పార్టీ సర్పంచ్ అడబాల రామాంజనేయులు, ఉప సర్పంచ్ రాయుడు జ్యోతి, వార్డ్ మెంబర్లు, రామాంజనేయులు అనుచర గణం 500 మందితో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ముందుగా జ్యోతుల నెహ్రూకు భారీ ఊరేగింపుగా నాయకులు కార్యకర్తలు అభిమానులు బాణాసంచా కాల్పులతో గ్రామా సచివాలయం వరకు మహిళల మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో సర్పంచ్ గా పనిచేయుటకు బాధపడుతున్నామని,పంచాయతీ నిధులన్నీ పక్కదారి మళ్లించి సర్పంచులను ఏ పని చేయకుండా పంచాయతీరాజ్ వ్యవస్థని నాశనం చేసి ఆఖరికి సైడ్ కాలువలు మట్టి తీయలేని పరిస్థితిలోకి వచ్చామని, రేపు రాబోయే తెలుగుదేశం పార్టీలో పంచాయతీలు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. నా కార్యకర్తలను, మా అనుచరులను కేసులు పెట్టి వేధిస్తున్నారని ఇప్పుడు జాయిన్ అవుతున్న వారిని ఇబ్బందులు గురిచేయాలంటే నన్ను దాటి వెళ్లాలని అధికార పక్షానికి సవాల్ విసిరిన రామాంజనేయులు. జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, అడబాల భాస్కరరావు తో కలిసి గ్రామానికి కావలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ నాకు కొండంత అండగా ఉన్న నా మిత్రుడు అడబాల భాస్కరరావు నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాడని, అడబాల కుందరాజు జీవితకాలం కాంగ్రెస్ నే నమ్ముకుని పనిచేశాడని ఈరోజు వారి కుమారుడు సర్పంచ్ అడబాల రామాంజనేయులు పార్టీలో చేరడం పార్టీ గెలుపుకు శుభ సూచకమని ఆంజనేయులు, భాస్కరరావు ఆధ్వర్యంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, మారిశెట్టి భద్రం, అడబాల భాస్కరరావు, కందుల చిట్టిబాబు, కొత్త కొండబాబు, కోర్పు సాయి తేజ,తమటం వీరభద్రరావు రావు, సుంకవిల్లి రాజు, బొల్లం రెడ్డి రామకృష్ణ, జోశ్యుల రాంబాబు, దాపర్తి సీతారామయ్య, య ర్రంశెట్టి బాబ్జి, ముసిరెడ్డి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.