రౌతులపూడి :మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ఉపాది హామీ జిల్లా ఏపిడి జగదాంబ శనివారం పర్యటించారు.ఏజెన్సీ ప్రాంతాలైన జల్దం ,రాఘవపట్నం పంచాయతీల్లో నిర్వహిస్తున్న పనులను ఆమె పరిశీలించారు.ఉపాధి హామీ పనులు కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనిఏపీ డికి తెలిపారు.పనులు లేక ఖాళీగా ఉంటున్నామని ఆమె ముందు గిరిజనులు వాపోయారు.అనంతరం స్థానిక ఉపాధిహామీ కార్యాలయం నందు ఫీల్ అసిస్టెంట్లు, టీఏ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.పనులు నిర్వహణలో అలసత్వం వహిస్తే క్షమించేది లేదని హెచ్చరించారు.గ్రామాలకు, రైతులకు, ప్రజలకు ఉయోగకరమైన పనులను గుర్తించి గ్రామాలలో కూలీలకు పనులు కల్పించాలన్నారు.వేసవికాలం కావడంతో పని చేస్తున్న కూలీలకు ఎండ తీవ్రతకు తట్టుకునే టెంట్లు,మంచినీరు,ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కూలీల మస్తర్ రోల్, ప్లే ఆర్డర్ షిప్లు బాధ్యతగా నమోదు చేయాలన్నారు. పనుల నిర్వహణలో అవకతవకలకు పాలు పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.ప్రభుత్వ నియమ నిబంధనలకు పనిచేయాలని సిబ్బందికి సూచించారు.హార్టికల్చర్ సెరికల్చర్ వంటి పథకాలపై రైతులుకి అవగాహన కల్పించాలన్నారు.రైతులకు ఉపయోగపడే పనులు గుర్తించాలన్నారు.కూలీలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మాస్టర్ రోల్ నమోదులో అవకతవకలకు పాల్పడుతున్నట్లు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎం ప్రేమ్ సాగర్,ఏపీఓ సురేష్, ఏఇ బాలకృష్ణ, టిఏ, మనీకుమార్,ప్రసాద్.
