గొల్లప్రోలు
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాద్ పురస్కారాలు అందించారు. గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశానికి ఎంపీ గీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లా వాలంటీర్లు సేవలందిస్తున్నారని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లే కీలకమని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వివిధ గ్రామాలకు చెందిన వాలంటీర్లకు పురస్కారాలు, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, ఎంపీపీ అరిగెల అచ్చియ్యమ్మ రామన్న దొర, వైస్ ఎంపీపీ నేమాని ఆది విష్ణు, మాజీ ఎంపీపీ ఉలవకాయల సత్యనారాయణ, ఎంపీటీసీ ఆకుల శ్రీను, వెలుగుల సత్యనారాయణ, కొడవలి సర్పంచ్ బుర్రా నాగచంద్ర పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.