జీలుగుమిల్లి
గణతంత్ర దినోత్సవం నాడు జీడిమల్లి మండలంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలోనూ తాసిల్దార్ కార్యాలయంలో ఇరువురికి ప్రశంస పత్రాలు మెమొంటోళ్లు అందుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఉత్తమ అడ్మనిస్ట్రేటివ్ ఆఫీసర్ విభాగంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ అధికారిణి కె.ఎమ్. మంగతాయారు కి ఐ టి డి ఎ పి ఓ చేతుల మీదుగా అవార్డ్ ప్రధానం చేశారు.
మండలం లోని తహశీల్దార్ కార్యాలయం లో ఉత్తమ సేవలకు గాను జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న ఎమ్.శాంతినీ పలువురు అభినందించారు . సర్వీసులో మరెన్నో పదవులు అలంకరింప చేసుకోవాలని వారు మండలంలోని ప్రజాప్రతినిధులు అధికారులు శ్రేయోభిలాషులు కోరారు.