10న ముగింపు వేడుకలకు హాజరుకానున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 10న విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. 6 నుంచి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘ఆడుదాం-ఆంధ్రా’ పోటీలు ప్రారంభం కానున్నాయి. 10న వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్న ముగింపు కార్యక్రమానికి జగన్ హాజరవుతారు. ఆడుదాం ఆంధ్రా పోటీల్లో ఏపీలోని ఒక్కో జిల్లా నుంచి కనీసం 130 మంది చొప్పున రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు.
రూ. 1500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున తెలిపారు. ఇప్పటికే పలు పనులు పూర్తయినట్టు పేర్కొన్నారు. అలాగే, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు 14 వేల మంది సిబ్బంది హాజరవుతారని కలెక్టర్ తెలిపారు.

