Friday, February 20, 2026

Creating liberating content

తాజా వార్తలుఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు


అమరావతి:-ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూన్ 26తో ఈ సమావేశాలు ముగుస్తాయి. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం జరగాల్సి ఉంది. వాస్తవానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 19 నుంచి అయితే, గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవుల్లో ఉండడంతో, ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 24 నుంచి జరపాలని నిర్ణయిం చారు. ఈ నెల 24న ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకుంటారు. అనంతరం కొత్త ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాగా, ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ అయ్యన్నపాత్రుడు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తారని కూడా కథనాలు వస్తున్నాయి. వీటిపై కూటమి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article