- లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
- పులివెందుల ఆర్డీఓ వెంకటేషు
వేంపల్లె
నవరత్నాలు-అర్హులందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న లేఔట్ ల్లోని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను పులివెందుల ఆర్డీఓ వెంకటేషు అందజేశారు. గురువారం స్థానిక వైఎస్ మదీనపురంలో తహసీల్దార్ వెంకటేష్ నాయక్ తో కలిసి ఆయన లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి రిజిస్ట్రేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు మంజూరుతో పాటు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, అయితే అందుకు సంబంధించి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే ఆయా సచివాలయ పరిధిల్లో లబ్ధిదారులకు ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తామని.. వృద్ధులు, కొందరు రాలేని పరిస్థితుల్లో ఉన్న లబ్ధిదారులకు నేరుగా వారి ఇంటి వద్దకే రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ లోకేష్, విఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు, వార్డుసభ్యుడు ఉమర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.