జ్యోతుల నెహ్రూని గెలిపించండి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించండి ప్రత్యేక కరపత్రంతో ఓట్లు అడుగుతున్న జ్యోతులనవీన్
జగ్గంపేట
జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జగ్గంపేట మండలం మామిడాడ గ్రామం నుంచి ఇంటింట ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాన్ని పంపిణీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున తన తండ్రి పోటీ చేస్తున్నారని ఆయనకు సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి గా పోటీ చేయుచున్న జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం ఆయన తనయుడు జ్యోతుల నవీన్ ఈరోజు ముహూర్తం చూసుకుని ఇంటింటి ప్రచారం ప్రారంభించారని ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని నెహ్రూని గెలిపిస్తే నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి త్రాగునీరు సాగునీరు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్యా, వైద్యం మౌలిక వసతులు కల్పిస్తారని తెలియజేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపిస్తే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సంక్షేమం అభివృద్ధి సమానంగా అందించే ఏకైక నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, కిర్లంపూడి జడ్పిటిసి తోట రవి, తోట గాంధీ, కోర్పు సాయి తేజ, అడబాల వెంకటేశ్వరరావు, జీను మణిబాబు, వీరం రెడ్డి కాశి బాబు, అనుకుల శ్రీకాంత్, బుర్రి సత్తిబాబు, బస్వా చిన్న బాబు, తూము కుమార్, పైడిపాల సూరిబాబు, అడబాల భాస్కరరావు, కందుల విజయ్, కందుల వినయ్, బస్వా వీరబాబు, జ్యోతుల రాంబాబు, దాపర్తి సీతారామయ్య, కురుకూరి వీర వెంకట చౌదరి, సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ (య ల్లమిల్లి సీఎం) జ్యోతుల సత్యమూర్తి, మావిడా గ్రామ టిడిపి జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.