Saturday, April 11, 2026

Creating liberating content

తాజా వార్తలుఆశా వర్కర్ల కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ఆశా వర్కర్ల కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

గండేపల్లి

రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు తమ డిమాండ్స్ నెరవేర్చకపోగా ఉక్కు పాదం మోపడం సరికాదని ఆశా వర్కర్ల యూనియన్ సభ్యులు తెలిపారు. 8 వ తారీఖున తమ డిమాండ్స్ కొరకు చలో విజయవాడ వెళ్తున్న ఆశ వర్కర్లను ప్రభుత్వం పోలీసులతో నిరంకుసంగా వ్యవహరించిన తీరుపై శుక్రవారం స్థానిక తహాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం తహాసిల్దార్ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారంగా జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని తమ డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటూ రెండు రోజులు పాటు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల మండల సంఘ అధ్యక్షులు లలిత,దివ్య శాంతి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article