లేపాక్షి :
మండల పరిధిలోని బిసల మానేపల్లి గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు లేపాక్షి వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చోళ సముద్రం కరణం రమానందన్ ను కలసి అభినందించారు. లేపాక్షి వీరభద్రాలయ కమిటీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బిసల మానేపల్లి గ్రామస్తులు కలసి పలు విషయాలపై చర్చించారు. తమ గ్రామంలో ఆలయ అభివృద్ధికి ఆర్థిక సహకారమందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని మహోన్నత పదవులను అధిరోహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెంకటాచారి, అశ్వర్థ నారాయణ, ఓబులేసు, నారాయణస్వామి ,సుబ్బరాయప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ కు పుష్పగుచ్చాలను అందజేశారు.