- శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ కేకేఎన్.అన్బురాజన్
అనంతపురము
అనంతపురం ఏ.ఆర్. (ఆర్మ్డ్ రిజర్వ్) విభాగంలో పని చేస్తున్న ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. ఈయనను చిత్తూరు జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయనపై స్థానిక 4వ పట్టణ పోలీసు స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు దృష్ట్యా నమోదైన కేసు నేపథ్యంలో జిల్లా ఎస్పీ కేకేఎన్.అన్బురాజన్ దీనిని తీవ్రంగా పరిగణించారు. అందులో భాగంగా తొలుత.. అయనపై బదిలీ వేటు వేశారు. అంతేకాకుండా శాఖాపరమైన చర్యలకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. “చట్టం అందరికీ సమానమే… తప్పు చేస్తే ఎవర్నీ ఉపేంక్షించబోము ” అని ఎస్పీ స్పష్టం చేశారు.