కడప సిటీ
గురువారం ఎనిమిదో తారీకు కడప పట్టణంలో గల కాంగ్రెస్ఆఫీసులో మీడియా ఇంచార్జ్ తులసిరెడ్డిమాట్లాడుతూముఖ్యమంత్రి తన పేరును జలగ రెడ్డిగా, లేదాబాదుడు రెడ్డిగా మార్చుకుంటే సమంజసంగా ఉంటుంది అన్నారు.
పన్నులమోత, చార్జీలవాతా – ఇది జగన్ పాలన?ఈ 56 నెలల్లో దాదాపు రూ.1.40 లక్షల కోట్ల అదనపు భారం ప్రజలపై మోపింది.
మద్యంపైఅదనపుభారoరూ.16 వేలకోట్లు,
ఇసుకరూ10వేలకోట్లు,ఆస్తిపన్నరూ07వేలకోట్లు ,డ్రైనేజీ,నీటిపన్ను రూ.04వేలకోట్లు,
విద్యుత్ చార్జీలు రూ.30 వేలకోట్లు,
పెట్రోల్, డీజల్ రూ.50 వేలకోట్లు,ఆర్టీసి రూ.15 వేలకోట్లు,
ఈ విధంగా జలగ మనుషుల రక్తం తాగినట్లు, వైకాపా ప్రభుత్వం చార్జీలు, ధరలు, పన్నులు పెంచివినియోగదారుల రక్తం తాగుతుంది అన్నారు.
హవ్వా.. బిజెపితో పొత్తా!కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది.
ప్రత్యేకహోదాకు పంగనామాలు పెట్టింది.రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజికీ తిలోదకాలు ఇచ్చింది.కడపజిల్లాలో స్టీల్ ప్లాంట్ కు స్వస్తిపలికిందిదుగ్గరాజపట్నం ఉసేలేదు.
పోలవరం ప్రశ్నార్థకం అయింది?విజయవాడ మెట్రో రాలేదు.విశాఖ మెట్రో రాలేదు,విశాఖరైల్వేజోన్ రాలేదు,విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు,
విశాఖఉక్కునుప్రైవేట్ పరం చేస్తుంది,
అటువంటి ద్రోహపు పార్టీతో టిడిపి, జనసేనలు పొత్తు పెట్టుకోవడమా? ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
షర్మిలమ్మ భద్రత ప్రభుత్వానిదేఅన్నారు.షర్మిలమ్మకుభద్రత పెంచాలిసింది పోయి, తగ్గించడందురదృష్టకరం,వెంటనే భద్రత పెంచాలి అని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.