Saturday, November 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్ఆనంద్ రెడ్డి ఆర్థిక బాగోతం

ఆనంద్ రెడ్డి ఆర్థిక బాగోతం

  • 150 కోట్ల మోసం బట్టబయలు
  • విదేశాలకు నిధుల మళ్లింపు అనుమానం
  • వెనుకున్న మాస్టర్‌మైండ్ అతనేనా?

ప్రజాభూమిప్రతినిధి – తిరుపతినేరవిభాగం

తిరుపతి నగరంలో క్యూనిక్స్ హబ్ సంస్థ నడుపుతున్న వ్యాపారవేత్త ఆనంద్ రెడ్డి పేరు ఇప్పుడు ఆర్థిక ప్రపంచంలో సంచలనం రేపుతోంది. కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై పలు నగరాల్లో కేసులు నమోదవడంతో పోలీసు వర్గాలు సైతం అప్రమత్తమయ్యాయి. ప్రాథమికంగా ఈ వ్యవహారంలో 150 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి ఆవిలాల రోడ్డులోని బైరాగిపట్టెడ ప్రాంతంలో క్యూనిక్స్ హబ్ గ్రూప్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసిన ఆనంద్ రెడ్డి, రియల్ ఎస్టేట్, డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్, ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ వంటి పేర్లతో వ్యాపారం సాగించేవారు. అందమైన యువతులను నియమించి, తీపి మాటలతో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి మహిళలు, మధ్యతరగతి ఉద్యోగుల నుండి భారీగా నిధులు సేకరించినట్లు సమాచారం. కొద్ది కాలానికే సంస్థ కార్యకలాపాలు నిలిచిపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు జరిపిన ఎం.ఆర్.పల్లి పోలీసులు ఆనంద్ రెడ్డిని కాకినాడలో అదుపులోకి తీసుకున్నారు. అతని అరెస్టు తర్వాత కొత్త కొత్త బాధితులు బయటకు వస్తున్నారు. చిన్న, మధ్య తరగతి కుటుంబల వారికి అధిక వడ్డీ ఆశ చూపడంతో వారు ఇల్లు, పొలాలు, బంగారు తాకట్టు పెట్టి మరి డబ్బులు ఇచ్చినట్లు బాధితులు వాపోతున్నారు. అధిక వడ్డీకి ఆశపడి ఇళ్ళు, పొలాలు, బంగారు పోగొట్టుకొని రోడ్డున పడ్డామని బాధి తులు ఆవేదన చెందుతున్నారు.

దీని వెనుక ఉన్నది ఎవ్వరూ?

అయితే, ఆనంద్ రెడ్డి వెనుక ఉన్న అసలైన మాస్టర్‌మైండ్ అతని స్నేహితుడు తోట కిరణ్ కుమార్ అని బాధితులు వాపోతున్నారు. వరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న కిరణ్ కుమార్ ట్రేడింగ్, మార్కెటింగ్, పెట్టుబడుల సేకరణ, హవాలా మార్గాల్లో నిధుల విదేశాలకు తరలింపు, బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు వంటి చర్యల్లో కీలక పాత్ర పోషించాడనిఆరోపణలు ఉన్నాయి.ఆనంద రెడ్డి తిరుపతి, విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరు ఇలా ప్రధాన నగరాల్లో కలిపి 150 కోట్లకు పైగా మధ్యతరగతి ఉద్యోగుల నుండి అక్రమంగా సంపాదించారని ఈ నిధులు, బినామీల పేర్లతో ఆస్తులు కొనుగోలు, హవాలా ద్వారా విదేశాలకు మళ్లించబడ్డాయనే అనుమానం వ్యక్తమవుతోంది. అనధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ కేసు వెనుక కొందరి హస్తం ఉందని, కేసు నుండి బయటకు రాగనే విదేశాలకు పారిపోవడానికి వారి అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రజా వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పలువురు విశ్లేషకుల మాటల్లో..ఇలాంటి ఆర్థిక నేరగాళ్లు సాధారణ ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకుంటేనే మరికొందరికి బుద్ధి వస్తుందని, ఇలాంటి వ్యక్తులను శిక్షించకుండా మళ్లీ బయటకు వదిలితే మరో పెద్ద ఆర్థిక నేరగాళ్లుగా అవతారమెత్తుతారని, ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు బాధితులు ప్రభుత్వం, పోలీసు శాఖ తక్షణ చర్యలు తీసుకుని తమ నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఆనంద రెడ్డి ని మరోసారి కస్టడీకి కోరినట్లు సమాచారం. నేపథ్యంలో ఆనంద్ రెడ్డి నుంచి ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article