కదిరి :పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కియో జపాన్ షోటోకాన్ కరాటే డు అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో మాస్టర్ అక్బర్ అలీ నిర్వహించిన కరాటే బెల్ట్ ఎగ్జామినేషన్ లో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారని కరాటే మాస్టర్ తెలిపారు. విద్యార్థులు చాలా చాకచక్యంగా పంచస్, కిక్స్, బ్లాకింగ్, సెల్ఫ్ డిఫెన్స్, టెక్నిక్స్, నాంచాక్ రొటేషన్, టైల్స్ బ్రేకింగ్ కథస్ నిర్వహించారు. వీరందరికీ కదిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ చేతుల మీదుగా సోమవారం విద్యార్థిని, విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు, బెల్ట్స్ అందజేశారు. కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ కరాటే సాధన చేయడం కోసం విద్యార్థిని, విద్యార్థులు చాలా క్రమ శిక్షణగా ఉదయం, సాయంత్రం శిక్షణ పొంది విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని, ఇలాగే ప్రతిరోజూ కరాటే సాధన చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అదేవిధంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఉంటారని తెలిపారు. అలాగే వారు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వారిలో మనోధైర్యాన్ని పెంచే విధంగా కరాటే తోడ్పడుతుందని చెప్పారు. కరాటే ఎస్.జి.ఎఫ్ టోర్నమెంట్స్ లో గెలిచే సర్టిఫికెట్ ద్వారా 2 శాతం స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ కూడా ఉంటుందని, దాని ద్వారా పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. మాస్టర్ అక్బర్ అలీ విద్యార్థులు కరాటే, బాక్సింగ్, జూడో లాంటి క్రీడల్లో పాల్గొని సత్తా చాటారని తెలిపారు. జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు పాల్గొని ఎన్నో విజయాలు సాధించాలని, మన ఊరికి, మన దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరారు. అలాగే శిక్షణ ఇచ్చిన మాస్టర్ అక్బర్ అలీని అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ లు రియాజ్ అలీ ఖాన్, వసుంధర, హారిక, పవన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

