మార్కాపురం
పట్టణలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ఆటోలను నడపాలని ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా మద్యం తాగి ఆటో నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సి ఇన్సూరెన్స్ ఫోర్స్ లో ఉండే విధంగా చూసుకోవాలని ఆయన అన్నారు.ఆటోలలో ఎక్కిన వారు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ తెలియజేశారు..