Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఉద్దె.మద్దిలేటి డిమాండ్.

కడప అర్బన్

ఫిబ్రవరి 29 న కలెక్టర్ ఆఫీస్ దగ్గర మహా ధర్నాను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికులకు ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఉద్దె.మద్దిలేటి, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి లింగన్న, జిల్లా అధ్యక్షుడు బి. రామాంజనేయులు, భవన కార్మికులకు పిలుపునిచ్చారు.మంగళవారం కడప నగరంలోని చిలకల బావి దగ్గర వున్న హోచిమెన్ భవన్ ఏఐటీయూసీ ఆఫీస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఉద్దె. మద్దిలేటి, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగన్న, జిల్లా అధ్యక్షుడు బి. రామాంజనేయులు, మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వం 1996వ సంవత్సరంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2009 సంవత్సరంలో మన దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికులను ఆదుకొనుట కొరకు ఆంధ్ర ప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ సంక్షేమ బోర్డు నందు రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది కార్మికులు నమోదు చేసుకొని సంక్షేమ కార్డులు పొంది సంక్షేమ ఫలాలు అనుభవిస్తూ ఉన్నారన్నారు, అయితే ఇప్పటి ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన అప్పటి నుండి పని చేయు ప్రదేశములలో ప్రమాదములు వలన మరణించిన లేక సహజ మరణం చెందిన లేదా ప్రమాదం వలన శాశ్వత అంగవైకల్యం లేక పాక్షికంగా అంగవైకల్యం కలిగిన కార్మికులకు వారి కుటుంబమునకు ఇచ్చే పారితోషికములతోపాటు భార్య లేదా కుమార్తెలకు 2 కాన్పులకు ఇచ్చే పారితోషికములు మరియు కార్మికుల పిల్లలకు ఇచ్చే కాలర్షిప్లు నిలిపివేసి వేశారన్నారు సుమారు 32 వేల పైచిలుకు క్లెయిములు పెండింగ్లో ఉండట వలన కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు , పెండింగులో ఉన్న క్లెయిములకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కార్మికుల సంక్షేమం కోసం మా వద్ద నుండి సభ్యత్వ రూపంలోనూ మరియు యజమాని నుండి సెసు పేరుతో వసూలు చేయబడిన కోట్ల రూపాయలను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నప్పటికీ చట్టాలను ఉల్లంఘించి ఆ నిధులను ప్రభుత్వం ఇతర ప్రయోజనాలకు వాడుకొని కార్మికులకు అన్యాయం చేస్తూ ఉందన్నారు ,భవన నిర్మాణ రంగ కార్మికులపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రెక్కాడితే కానీ డొక్క ఆడని కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో అనేక కుటుంబాలు వీధుల పాలయ్యాయి అంతేకాకుండా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడడం దురదృష్టకరం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు నుండి పవర్ ఫైనాన్స్ పేరుతో కార్పొరేషన్లకు దారిన మళ్లించుకున్న నిధులను వెంటనే బోర్డు నందు జమ చేయాలని,ఇతర రాష్ట్రాల మాదిరిగా మన రాష్ట్రంలోను ప్రభుత్వ స్కీమ్లు పధకాలతో సంబంధం లేకుండా కార్మిక సంక్షేమ బోర్డును పటిష్టంగా అమలు చేసి పెండింగులో ఉన్న క్లైమ్ ములు పరిష్కరించి నిధులు మంజూరు చేయాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని, మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య తెచ్చిన వివాహ కానుక జీవోను రద్దుచేసి లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కుమార్తెలవాహములకు విద్యార్హతతో సంబంధం లేకుండా 40 వేల రూపాయలు ఇచ్చే విధముగా ప్రకటించాలని,నూతనంగా సంక్షేమ కార్డుల కొరకు అప్లై చేసుకున్న కార్మికులకు వెంటనే సంక్షేమ కార్డులు మంజూరుచేయాలని , సంక్షేమ బోర్డును సరైన గాడిలో పెట్టి సక్రమంగా నడిపించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 29న కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని భవనిర్మాణ కార్మికులకు వారు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article