మంత్రి బుగ్గన అంకెల గారిడీ పై యనమల దివ్య ధ్వజం
తుని.
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ పద్దులపై తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య నిప్పులు చెరిగారు. బుగ్గన బడ్జెట్ అంచనాలు కొండంత, ఖర్చు పిసరంత అన్నట్టుగా ఉందని ఆమె పేర్కొన్నారు. తలకు మించిన అప్పులతో జగన్ అండ్ కో ఆంధ్ర ప్రదేశ్ ను అప్పులాంధ్రప్రదేశ్ గా తయారు చేశారని యనమల దివ్య మండిపడ్డారు. బడ్జెట్లో కొత్తదనం ఏమీ లేదని అంత అంకెల గారడీ చేశారని ఆరోపించిన యువనేత్రి యనమల దివ్య, 13 వేల కోట్ల, రెవిన్యూ లోటును 44 వేల కోట్లకు, 35 వేల కోట్ల ద్రవ్యలోటును 60 వేల కోట్లకు పెంచిన ఘనాపాటి బుగ్గనని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో పొన్నూరు బాలుడు తప్ప కొత్త అంశాలు ఏమీ లేవు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు11.58 లక్షలని మద్యం బాండ్లు 16 వేల కోట్లు కార్పొరేషన్ హామీలు 1,10,603 కోట్లు, కార్పొరేషన్ తనఖాలు 94,928 వేల కోట్లు ఉన్నాయన్నారు. 27,284 వేల కోట్లు డిస్కం బకాయిలు, కాంట్రాక్టు పెండింగ్ బిల్లులు 95400 కోట్లు ఉన్నాయన్నారు. వైసిపి హయాంలో అప్పులు రెట్టింపు అయ్యాయన్నారు. 2019లో టిడిపి తీసుకున్న దానికన్నా జగన్ రెడ్డి ప్రభుత్వం నాలుగు రెట్లు అప్పులు చేసిందన్నారు. ప్రజలపై భారం పెంచడం తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజాసంక్షేమంపై చిత్తశుద్ధి లేదన్నారు