Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుఅయ్యప్ప స్వామి దీక్ష పరిపూర్ణమవ్వాలి

అయ్యప్ప స్వామి దీక్ష పరిపూర్ణమవ్వాలి

ఉప సర్పంచ్ కేసరి శ్రీహరి రెడ్డి
ప్రజా భూమి , కామవరపు కోట

భక్తిశ్రద్ధలతో కఠిన నియమాలతో చేపట్టే అయ్యప్ప స్వామి వారి దీక్ష పరిపూర్ణము అవ్వాలని జలపవారిగూడెం ఉపసర్పంచ్ కేసరి శ్రీహరి రెడ్డి అన్నారు. బుధవారం వైసిపి నాయకులు హైడ్రోటెక్స్ డైరెక్టర్ స్వర్గీయ కేసరి విజయభాస్కర్ రెడ్డి జయంతి సందర్భంగా కామవరపుకోట శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కేవీబీఆర్ యూత్ అభిమాని పెనుబోయిన శ్రీను (అమ్మ శ్రీను) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వాముల భిక్షా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీహరి రెడ్డి మాట్లాడుతూ మాలాధారణ చేసిన స్వాములు ఇబ్బందులు లేకుండా గత ఏడు సంవత్సరాలుగా అన్నదాన కమిటీ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో బిక్ష ఏర్పాటు చేయటం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కేసరి రఘుపతి రెడ్డి, నరేంద్ర రెడ్డి, రాంబాబు, అన్నదాన కమిటీ సభ్యులు కడిపి పాపారావు, బోల్లు సత్యనారాయణ, వీరమల్ల మధు, మారం రమేష్, నండూరి ప్రభాకర్, మారం బుజ్జి, కానూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article