గాజువాక:76 వార్డులో మంత్రి అమర్నాథ్ ఎన్నికల ప్రచారం జగన్మోహన్ రెడ్డి సైన్యంలో సైనికుడు.. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక 76 వార్డు ఇన్చార్జి దొడ్డి రమణ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మహిళలు ఆయనకు నీరాజనాలు పలికారు. కనీవిని ఎరుగని రీతిలో మహిళలు వచ్చి అమర్నాథ్కు జై కొడుతూ అలుపెరగక ఆయన వెంట నడిచారు. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి మీద అభిమానం.. మరొకవైపు అమర్నాథ్ గెలిపించాలన్న లక్ష్యం మహిళల్లో కనిపించింది. పథకాలు ఇచ్చి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి, గాజువాక నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చేయడానికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అమర్నాథ్ను నీ గెలిపించడానికి ఈ వార్డు ప్రజలంతా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంతో వందలాదిమంది మహిళలు పిల్లాపాపలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూజగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ మహిళల పేరు మీద ఇచ్చారని, మహిళా పక్షపాతి అని, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ జగన్ మోహన్ రెడ్డిని అధికారులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎన్నికల్లో ప్రజలంతా వైసిపికి ఓటు వేయాలని ఆయన కోరారు. పేద బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా ఆదుకున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేసి రుణం తీర్చుకోవాలని మంత్రి అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. తను ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకను మరింతగా అభివృద్ధి చేస్తానని, మీ కష్టసుఖాలను దగ్గరుండి చూసుకుంటారని హామీ ఇచ్చారు. పూర్తిగా స్థానికుడనైన తనను గెలిపిస్తే మీ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని అమర్నాథ్ హామీ ఇచ్చారు.పెద్దలు నాగిరెడ్డి, చింతలపూడి వెంకట రామయ్య , మాజీ గాజువాకవైసీపీ ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, మాజీ గాజువాక సమన్వయకర్త ఉరుకూటి చందులను కలుపుకొని అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. అలాగే పార్టీ కోసం కష్టపడిన వారికి సమచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ దేవన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి అవినీతికి తావులేని పాలన అందించారని అన్నారు. రాబోయే రోజుల్లో సుపరిపాలన కొనసాగాలంటే మళ్ళీ జగన్ మోహన్ రెడ్డిని మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధి చెందడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని, ఈ అభివృద్ధి ఆగకుండా కొనసాగాలంటే గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారుఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, చిక్క సత్యనారాయణ, రంభ నారాయణమూర్తి, తాటికొండ జగదీష్, తాటికొండ అచ్యుత్, కులుకూరి మంగ రాజు,అనపర్తి రమణ, మొలకలపల్లి ప్రసాద్, రావాడ భవాని, శ్రీకాంత్, అండిబోయిన సన్ని, కాక్కుళ్ల మురళి, దీని శెట్టి చిన్నారావు, బ్రహ్మానంద రెడ్డి,కే. బాలాజీ, నాగు, పార్వతి, పరంకుసం ప్రమీల, నరసింహమూర్తి, పెంటకొట నాగేశ్వర రావు, ఆర్.వేణుగోపాల్ రావు, ములకలపల్లి అశోక్, కాకినాడ పెంటారావు, మంత్రి మంజుల, గొరుసు రామలక్ష్మి, పప్పల పుష్ప, తిప్పల స్వాతి, గొంప రమేష్, రామ జ్యోతి, పత్రి దేవి, ఆర్.రేవతి అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
