చుట్టపు చూపుగా వచ్చే మీరా వైకాపాను విమర్శించేది. విలేకరుల సమావేశంలో వైకాపా మండల కన్వీనర్.
లేపాక్షి: హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పాలనలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నారాయణస్వామి తదితరులు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన లేపాక్షి లో కన్వీనర్ నారాయణస్వామి, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి ,సర్పంచ్ ఆదినారాయణ ,కాంట్రాక్టర్ నారాయణ స్వామి ,మండల అగ్రి బోర్డు చైర్మన్ ప్రభాకర్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కన్వీనర్ నారాయణస్వామి మాట్లాడుతూ, హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. ఏరోజైనా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన దాఖలాలు ఉన్నాయా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. జీవితకాలం సినిమాలు తీసుకుంటూ ఉన్న తమరు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడు కాలాన్ని వెచ్చి స్తారని విమర్శించారు. నియోజకవర్గ నాయకుల ఇళ్లల్లో జరిగే కార్యాలకు వచ్చి వెళ్ళే తమరు ఇటీవల కాలంలో పలు పర్యాయాలు నియోజకవర్గానికి ఎందుకు వచ్చారో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు ఓటమి భయం పట్టుకుందని అందుకోసమే ఇటీవల పలు సార్లు వచ్చి వెళ్లారన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలు కూడా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కన్వీనర్ నారాయణస్వామి పేర్కొన్నారు. జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, హిందూపురం నియోజకవర్గంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైయస్ఆర్కే దక్కిందన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో పారిశ్రామిక వాడ అభివృద్ధిలో వెనుకంజ వేసిందన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సర్పంచ్ ఆదినారాయణ మాట్లాడుతూ, వీరభద్రాలయం, నంది విగ్రహం వల్లనే లేపాక్షి పర్యాటక రంగంలో ప్రసిద్ధి పొందిన దన్నారు. అంతేగాని బాలకృష్ణ లేపాక్షి లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ నారాయణస్వామి, చలపతి,
కోడిపల్లి సర్పంచ్ మంజునాథ్ ,చోళ సముద్రం ఉపసర్పంచ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.