హిందూపురం టౌన్
బలిజలు అన్ని రంగాల్లో రాణిస్తేనే గుర్తింపు లబిస్తుందని ఎపి ఆగ్రోస్ చైర్మెన్ నవీన్ నిశ్చల్ అన్నారు. శుక్రవారం శ్రీ కృష్ణ దేవరాయల జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బలిజల ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమం లో నవీన్ నిశ్చల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయల విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ ఆయన మాట్లాడుతూ ,బలిజలు ఐక్యమత్యంగా ఉంటే మనదే అధికారం అన్నారు. రాష్ట్రంలో 5కోట్ల జనాభా ఉంటే అందులో బలిజలు 1.25కోట్ల మంది ఉన్నామన్నారు. ఇంతమంది ఉన్నప్పటికి చట్టసభల్లో ఎంత మంది ఉన్నామన్నా విషయాలను అందరూ గుర్తించు చేసుకోవాలన్నారు. ఏ పార్టీలో ఉన్నా బలిజలు బలిజలకు సహకరించి, రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించాలన్నారు. వైకాపా విద్యార్థి విభాగం నాయకుడు నాగభూషణం మాట్లాడుతూ, రాయలసీమ జిల్లాల్లో బలిజ కులస్తులకు అధికంగా ఉన్నా ఒక్క స్థానం కూడా ముఖ్యమంత్రి జగన్ కేటాయించ లేదని, ఇప్పటికైనా హిందూపురం అసెంబ్లీ స్థానాన్ని 2024 ఎన్నికలల్లో నవీన్ నిశ్చల్ కు టికెట్ కేటాయించాలని కోరారు. అనంతరం నవీన్ మహిళలకు చీ రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బలిజలు పాల్గొన్నారు.