హిందూపురం టౌన్
హిందూపురం పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న ప్లే స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి విద్యార్థి సంఘాల నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు బాబావాలి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, హిందూపురం పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా ప్లే స్కూల్స్ సబ్ బ్రాంచ్ లను నిర్వహిస్తున్నారన్నారు. ఒక్కొక్క విద్యార్థి నుండి రూ. 35000 నుండి 40,000 వరకు ఫీజులు వసూలు చేయడమే కాకుండా పుస్తకాలు యూనిఫాం తదితర విద్యా సామాగ్రి అక్కడే కొనుగోలు చేయాలని నిబంధన పెట్టి
రూ .15000 వరకు వసూలు వసూలు చేస్తున్నానని విమర్శించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నుండి నిబంధనలకు విరుద్ధంగా వేల రూపాయలు వసూలు చేస్తూ కనీసం ప్లే స్కూల్ కు ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యను వ్యాపారంగా చేస్తున్నారన్నారు వెంటనే సంబంధిత అధికారులు అనుమతులు లేని ప్లే స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాబోవు రోజుల్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాట నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ నాయకులు చంద్రశేఖర్ నరసింహమూర్తి పాల్గొన్నారు