Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుఅనంతలో వైసీపీ విజయం ఖాయం

అనంతలో వైసీపీ విజయం ఖాయం

  • టికెట్‌ కోసం ప్రయత్నిస్తాం.. కానీ పార్టీనే ఫైనల్‌
  • అహుడా చైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌ స్పష్టీకరణ
  • 25వ డివిజన్‌లో ఎమ్మెల్యే అనంతతో కలిసి ‘ఇంటింటికీ వైసీపీ’లో పర్యటన

అనంతపురము
అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో వైసీపీ విజయం ఖాయమని అహుడా చైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌ ధీమా వ్యక్తం చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు కొంత మంది వచ్చి ఏదో చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నగరంలోని 25వ డివిజన్‌లో శనివారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ‘ఇంటింటికీ వైసీపీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అహుడా చైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌ విలేకరులతో మాట్లాడారు.
మహాలక్ష్మి శ్రీనివాస్‌ కామెంట్స్‌ :

  • బస్సుయాత్రతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనంలోకి వచ్చాక జనసునామీ కనపడుతోంది. దీన్ని చూసి టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది.
  • ఎవరో కొంత మంది వైసీపీ వీడడం వల్ల అనంతపురం నియోజకవర్గంలో మా పార్టీకి జరిగే నష్టం నథింగ్‌.
  • అనంతపురం గతంలో కాంగ్రెస్‌కు, ఇప్పుడు వైసీపీకి కంచుకోట. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలు చూశారు.
  • మేం ఇచ్చిన హామీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఉంది. ఆ ఒక్కదాన్ని పట్టుకుని దగ్గుబాటి ప్రసాద్‌ నిన్న మాట్లాడుతున్నాడు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఆయనకు కనిపించలేదా?
  • అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం.
  • వైఎస్‌ జగన్‌ బస్సుయాత్ర చేస్తుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు జనాలే లేరని రాస్తున్నాయి. దాన్ని చూసుకుని టీడీపీ నాయకులు మురిసిపోతున్నారు. గ్రౌండ్‌ లెవల్‌లో వాస్తవ పరిస్థితి వాళ్లకు అర్థం కావడం లేదు. మేం సాధించే విజయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా భాగస్వాములే.
  • టికెట్‌ కోసం అందరూ ప్రయత్నిస్తాం. కానీ పార్టీనే ఫైనల్‌. పార్టీ అధికారంలో ఉంటేనే అందరూ బాగుపడతారు.
  • అనంతపురం నియోజకవర్గంలో వైసీపీని ఎలా గెలిపించుకోవాలో మాకు ప్రణాళిక ఉంది. నామినేషన్ల తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాం.
  • అవ్వాతాతలకు పింఛన్లు అందకుండా వాలంటీర్లపై ఆంక్షలు పెట్టేలా చేసిన ఘనత చంద్రబాబుదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article