*అందరిని పీడించి ఏడ్పించే కార్యాలయమా..!
*లంచాల కోసం పేదల బ్రతుకులనే లూటీ చేస్తారా…
*దళితులంటే అంత చిన్న చూపా…
*పట్టా భూములకు కూడా పరిరక్షణ కరువా…
*నకిలీ పట్టాలకు ఏది అడ్డురాదా…
*మొన్న పూడి బత్తెమ్మ… నేడు పారి రవి…
*ఇంకెన్ని కొంపలు కూలుస్తుంటారు ఈ అధికారులు…
*అనర్హులకు అడ్డగోలుగా పట్టాలివ్వచ్చా…
*పత్రికా విలేకరులంటే కొమ్ములు ఉంటాయా…
*అక్కడ ఇచ్చిన అక్రమ పట్టాలెన్ని… సక్రమ పట్టాలెన్ని…
*పట్టాలు ఇచ్చేది వీరే…పొట్టలు నింపుకునేది వీరే…
*పేదల పొట్ట కొట్టేది వీరే…
*లంచాల కోసం ఇన్ని లుచ్చా పనులు చేస్తారా…
*పొలము ఉండేది ఎంత… పట్టాలు ఇచ్చేది ఎన్ని…
*ఎవడు రాసాడు ఈ అడ్డగోలు రాజ్యాంగం…
*ఏ రాజ్యాంగం చెప్పింది ఇలా అడ్డగడ్డి తినమని..
*పేదల బ్రతుకులు ఛిద్రమవుతున్నా పై అధికారులు పట్టుంచుకోరా…
*పట్టాలిచ్చేటప్పుడు వీరి కళ్ళకు కనపడలేదా…
*నోట్ల కట్టల కోసం పేదల నోటికాడి కూడు దూరం చేస్తారా…
*ఇదేనా గ్రామ స్వరాజ్యమంటే…
*ఇది గ్రామ స్వరాజ్యమా..అవినీతి రాజ్యమా…
*పేదవాడి బ్రతుకుకు అర్థం లేదా….
*ఈ అవినీతి అధికారుల అవినీతికి అడ్డుకట్ట పడేదెన్నడు…?
(రామమోహన్ రెడ్డి)

తహసీల్దార్ కార్యాలయం (మండల రెవెన్యూ కార్యాలయం లేదా MRO ఆఫీస్) మండల స్థాయిలో రెవెన్యూ పాలన, భూ రికార్డుల నిర్వహణ, మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూసే అత్యంత కీలకమైన ప్రభుత్వ విభాగం. ఇది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.తహసీల్దార్ కార్యాలయంలో భూముల వివరాలు, పహాణీలు, అడంగల్, మరియు హక్కుల పత్రాలను (ROR-1B) జారీ చేయడం. కుల, ఆదాయ, నివాస, మరియు ఈడబ్ల్యుఎస్ (EWS) సర్టిఫికెట్లను జారీ చేయడం. కొత్త ఆహార భద్రత కార్డుల (రేషన్ కార్డు) కోసం దరఖాస్తులను స్వీకరించడం మరియు మార్పులు చేయడం. భూమి శిస్తు, వ్యవసాయేతర భూముల అంచనా మరియు ఇతర ప్రభుత్వ బకాయిలను వసూలు చేయడం. వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాల నమోదు, రైతు భీమా మరియు ప్రభుత్వ సహాయం అందేలా పర్యవేక్షించడం ప్రధాన బాద్యత గా పరిగణిస్తారు. గ్రామ స్థాయిలో భూ రికార్డుల నిర్వహణ, రెవెన్యూ వసూళ్లు, మరియు ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ఒక కీలకమైన ప్రభుత్వ యంత్రాంగం వీఆర్వో (గ్రామ రెవెన్యూ అధికారి) వ్యవస్థ. ఇది రెవెన్యూ శాఖలో అత్యంత ప్రాథమికమైనది.ముఖ్యంగావీఆర్వో వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలలో భూమికి సంబంధించిన అన్ని రకాల వ్యవహారాలను చక్కదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు.గ్రామాల్లో భూముల విస్తీర్ణం, హద్దులు, మరియు వాటి యజమానుల వివరాలను పక్కాగా రికార్డుల్లో నమోదు చేసి భద్రపరుస్తారు.కుల, ఆదాయ, నివాస ధృవపత్రాలు (certificates) వంటివి జారీ చేయడంలో వీఆర్వో ప్రాథమిక పరిశీలన చేసి సిఫార్సు చేస్తారు. భూమి కొలతలు, సర్వేల సమయంలో సర్వేయర్లకు సహాయపడటం మరియు వివాదాలను పరిష్కరించడంలో సహకరిస్తారు. వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూస్తారు. సర్వేయర్ అంటే భూమి యొక్క కొలతలు, సరిహద్దులు మరియు విస్తీర్ణాన్ని కొలిచే మరియు అంచనా వేసే నిపుణుడు. వీరు భూమి యొక్క స్వరూపాన్ని మ్యాపుల (Maps) రూపంలో తయారుచేస్తారు.సర్వేయర్ భూమి యొక్క చట్టపరమైన సరిహద్దులను ఖచ్చితంగా నిర్ణయించి, ఆస్తి ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ ముగుస్తుందో గుర్తిస్తారు.ఏదైనా భవనం, రోడ్డు లేదా వంతెన నిర్మాణం చేపట్టే ముందు, ఆ స్థలం యొక్క కొలతలు, ఎత్తులు మరియు వాలులను కొలుస్తారు. భూమి, నీరు మరియు భౌగోళిక లక్షణాలను మ్యాపింగ్ చేయడం ద్వారా మ్యాప్‌లను తయారు చేస్తారు. డిప్యూటీ తహశీల్దార్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ శాఖలో తహసీల్దార్‌కు అధీనంలో పనిచేసే ఒక ముఖ్యమైన గెజిటెడ్ ప్రభుత్వ పదవి. తాలూకా లేదా మండల స్థాయిలో రెవెన్యూ పాలనను పర్యవేక్షించడంలో, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో ఈ అధికారి కీలక పాత్ర పోషిస్తారు.డిప్యూటీ తహసీల్దార్ హోదాలో అధికారులు అనేక రకాల బాధ్యతలను నిర్వర్తిస్తారు.తహశీల్దార్ కార్యాలయానికి వచ్చే దస్త్రాలను పరిశీలించి, తగిన ఆదేశాల కోసం సిద్ధం చేయడం.రెవెన్యూ సిబ్బందిపై పర్యవేక్షణ, కార్యాలయ నిర్వహణ మరియు క్రమశిక్షణను కాపాడడం.వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, నివేదికలు సమర్పించడం.ప్రభుత్వ భూములు, వనరుల తనిఖీ మరియు కీలకమైన రికార్డుల ధృవీకరణ బాధ్యతలు నిర్వర్తించడం.ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను పరిశీలించి, అవసరమైన విచారణలు నిర్వహించడం వీరి బాధ్యత. భారతదేశంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఒక ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారి. తహసీల్దార్‌కు ప్రధాన అసిస్టెంట్‌గా ఉంటూ, మండల లేదా సర్కిల్ స్థాయిలో భూమి శిస్తు వసూలు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పర్యవేక్షించడం వీరి ప్రధాన బాధ్యత.వీరు గ్రామ స్థాయిలో వీఏవో (గ్రామ రెవెన్యూ అధికారి) మరియు పంచాయతీ కార్యదర్శులు సక్రమంగా రికార్డులు నిర్వహిస్తున్నారో లేదో తనిఖీ చేస్తారు. ప్రభుత్వానికి రావాల్సిన భూమి శిస్తు, పన్నులు మరియు ఇతర బకాయిలను సక్రమంగా వసూలు అయ్యేలా చూస్తారు. సర్వే రాళ్ళు తనిఖీ చేయడంతో పాటు, 100 శాతం పంటల వివరాలు పరిశీలిస్తారు.నీటిపారుదల మరియు భూముల సరిహద్దులకు సంబంధించిన వివాదాలను విచారించి పరిష్కరిస్తారు.సామాజిక సంక్షేమ పథకాలు, పెన్షన్లు, భూసేకరణ మరియు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలను పర్యవేక్షిస్తారు.ఇది సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏర్పాటు చేసి పేద ప్రజల రక్త మాంసాలు చెమటగా మార్చి తినే తిండి త్రాగే నీరు పేల్చే గాలి ఇలా పంచవాయువులతో పాటు ఇతర వారికోసం వాడే వాహన వస్తు పన్నుల ద్వారా ప్రభుత్వం కు వచ్చే పేదల కష్టాన్ని ప్రభుత్వ అధికారులు అన్న హోదా ఇచ్చి చల్లటి చక్కటి వసతులు ఇచ్చి పేద ప్రజలకు సేవ చేయండని అంటుంటే ఆ పేదవాడి ప్రాణాలను కూడా తీసి వేయడానికి ఏమాత్రం వెనుకాడని స్థితిలో ఆయా ప్రాంత ప్రజలు ఉండటం వారు చేసుకున్న దౌర్భాగ్య మని చెప్పాలి. ఈ దేశానికి స్వాతంత్య్రం రాకమునుపే పరాయి దేశస్తులు పాలించిన ఈ ప్రాంతంలో ఉన్న భూముల సరిహద్దులు, సర్వే నెంబర్ ఆధారంగా చక్కగా ఆర్ ఎస్ ఆర్ అనే రికార్డ్ ల ద్వారా చక్కగా ఏర్పాటు చేసి నప్పటికి అవినీతి అధికారులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం చేయని తప్పంటు లేదని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఆనాదిగా వస్తున్న వారసత్వపు భూములను సైతం భూ మార్పిడికి వెనుకాడని నేటి పరిస్థితులలో ఇక పేదలకు పంపిణీ చేసిన డికెటి బంజరు భూముల్లో బక్క చిక్కిన పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బ్రతుకులు బజారుకీడుస్తూ వారి జీవన స్థితి గతులను చిన్నాభిన్నం చేయడానికి సిద్దమవుతున్నారు ఈ రెవెన్యూశాఖ అధికారులు.
ఇది ఎక్కడ ఏమిటే అన్న వివరాలలోకి వెళితే తిరుపతి జిల్లా ఎర్పేడు తహసీల్దార్ కార్యాలయం పలు వివాస్పద అంశాలకు దారి తీస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్న డిప్యూటీ తహసీల్దార్ మండల సర్వేయర్, చిందే పల్లి గ్రామ విఆర్వో,ఎండి పొత్తూరు గ్రామాల విఆర్వో ల పై ఆవేక రకాల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఎండి పొత్తూరు కు చెందిన ఓ పేద దళిత మహిళ పుత్తూరు బత్తెమ్మ గత పదనాలుగు సంవత్సరాల నుండి తన పొలం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి పోయి చివరికి తనను లంచం ఇవ్వలేదని ఆ కార్యాలయ డిప్యూటీ తహశీల్దార్, సర్వేయర్ ,విఆర్వో అవమానించారని తిరుపతి ప్రెస్ క్లబ్ సాక్షిగా కన్నీటి పర్యంతం అయినా కూడా ఉన్నతాధికారులు కనీస విచారణ చేయలేదనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. దళితుల పట్ల చిన్న చూపిన విషయం నిరూపితం అవ్వదన్న అహంకారంతో అధికారం తమకే చెల్లుబాటు అవుతుందని పేద ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుక వెళ్లే పలు పత్రికల వారికి ఇప్పటికే పలు చోట్ల విలువైన స్థలాలు కట్టబెట్టి తమ అవినీతి బైటికి రాకుండా చూసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి దురదృష్టకర సంఘటనలు అనునిత్యం అక్కడ జరుగుతున్న కూడా ఆ అన్యాయాన్ని అరికట్టేందుకు పాటుబపడాల్సిన కొంతమంది పత్రికల వారు మరిన్ని పట్టాలు పొంది పబ్బం గడుపుకునేందుకు పక్కా వ్యహరచన చేసుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలి అవినీతి అధికారులతో అంటకాగుతూ ఉన్నారనేది అక్కడి ప్రజల ద్వారా వెల్లడి అవుతోంది. అయితే ఇది ఎంత వరకు నిజం అన్నది ఆలోచన చేస్తే జూన్ నెలలో చిందే పల్లి విఆర్వో నిర్వాహకం సంబ్రాచ్చర్యానికి గురిచేస్తోంది.పారి రవి అనే దళిత రైతు కు 1995 లో ప్రభుత్వం మంజూరు చేసిన సర్వే నెంబర్ 23/5/15A నందు ఉన్న విస్తీర్ణం ఒక ఎకరం పద్దెనిమిది సెంట్ల పొలము కు సంబంధించి పట్టా ను మంజూరు చేసి మ్యూటెషన్ కు కూడా కాగితాలు ఇచ్చి పదిహేను రోజుల తరువాత ఆ సర్వే నెంబర్ లో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ పట్టాలు మంజూరు చేసి ఉన్నారని నోషినల్ ఖాతా నుండి తొలగించుటకు వీలు కాదని ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారని బాధిత రైతు ఆవేదన చెందుతున్నారు. కేవలం పైన చెప్పబడిన అధికారులు పుత్తూరు బత్తెమ్మ విషయంలో ఏ విధంగా చేశారో పారి రవి పొలం విషయంలో అలానే చేసారని బాధితులు వాపోతున్నారు.అయితే చిందేపల్లి గ్రామ విఆర్వో మునిస్వామి ఇచ్చే సమాధానం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పాలి. ఉండేది 200 ఎకరాల పొలమయితే అదనంగా మరో 170 ఎకరాల పొలము కు సంబంధించి పట్టాలు ఇచ్చారని చెప్పుకు వస్తూ ప్రభుత్వం నోషనల్ ఖాతా సవరణలకు అనుమతులు ఇవ్వలేదనే దాటవేత సమాధానం చెప్పడం విడ్డురంగా ఉంది.అయితే ఈ విఆర్వో వెనుక సర్వేయర్ డిప్యూటీ తహసీల్దార్ ఉండి ముగ్గురు కలిసి ఇలా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని చులకన చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనే బలమైన ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇదే అధికారులు ఇటీవల కాలంలో ఓ ఏడు ఎనిమిది మంది రైతుల పొలాలకు సంబంధించి వెబ్ ల్యాండ్ లో మార్చడం జరిగిందని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలు చూసి ఇది గ్రామ స్వరాజ్యమా లేక అవినీతి రాజ్యమా అన్న విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఎవరి పొట్టకూటి కోసం పేదల పొట్ట కొట్టి వారి నోటి కాడి కూడును దూరం చేస్తున్నారని దీనిపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏర్పేడు మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

