రామచంద్రపురం
ఇటీవల రామచంద్రపురం పట్టణం పెద్ద వంతెన వద్ద అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన రెండు కుటుంబాలకు రామచంద్రపురం నియోజకవర్గ కాపు ఐక్యతా గౄపు ద్వారా సేకరించిన సొమ్మును అందజేశారు. ఈమేరకు గురువారం పలువురు దాతలు తోపాటు గౄపు సభ్యులు కలిసి వెళ్ళి బాధిత కుటుంబాలను పరామర్శించారు.కొండ్రెడ్డి కుటుంబాలకు చెందిన రెండు ఇళ్ళుదగ్ధమై బారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే దీంతో రెండు కుటుంబాలకు రామచంద్రపురం నియోజకవర్గ కాపు ఐక్యత గ్రూపు ద్వారా సేకరించిన సుమారు 60 వేల రూపాయలు నగదును గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు రాయపురెడ్డి రాజా, డాక్టర్ రఘువీర్ కాంత్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేసారు. ఈ కార్యక్రమంలో మాగాపు అమ్మిరాజు, చిలుకూరి బ్రదర్స్ ,తొగరు మూర్తి ,అల్లం రామకృష్ణ ,చిక్కాల సుబ్బారావు ,సలాది శ్రీను ,కుప్పాల కొండ ,తదితర కాపు నాయకులు పాల్గొన్నారు.