Sunday, February 15, 2026

Creating liberating content

సినిమా“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ట్రైలర్ విడుదల

“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ట్రైలర్ విడుదల

గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథలకు లభించే ఆదరణ ఎక్కువనే విషయాన్ని చాలా సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు అదే దారిలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. సుహాస్ – శివాని జంటగా నటించిన ఈ సినిమా, ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లకు రానుంది. ‘కలర్ ఫొటో’ .. ‘రైటర్ పద్మనాభం’ సినిమాలు హీరోగా సుహాస్ సత్తాను చాటి చెప్పాయి. ఆ తరువాత ఆయన చేసిన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. రొమాన్స్ … యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ సినిమా నడుస్తుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ప్రధానమైన పాత్రలు .. వాటి స్వరూప స్వభావాలను పరిచయం చేస్తూ సాగిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో మల్లిగాడు పాత్రను సుహాస్ పోషించాడు. ఒక వైపున సెలూన్ నడుపుతూనే, మరో వైపున బ్యాండ్ బ్యాచ్ లో డప్పు కొడుతూ ఉంటాడు. అలాంటి అతను అదే ఊరికి చెందిన ఒక కాలేజ్ అమ్మాయితో ప్రేమలో పడితే ఏం జరుగుతుందనేదే కథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article