బుట్టాయగూడెం. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీల అక్రమ అరెస్టులను సిపిఎం పార్టీ బుట్టాయగూడెం మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ
అంగన్వాడి సమస్యలపై జగనన్నకు చెప్పుదాం అంటూ కోటి సంతకాలతో చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో ముందస్తు అరెస్టులు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. విచక్షణ రహితంగా మహిళలను అర్ధరాత్రి నుంచి అరెస్టు చేయటం సరైనది కాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తాను ఇచ్చిన హామీపై ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని కోరారు. నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను,కార్మిక ఉద్యమాలను ఆపలేరని అన్నారు. అంగన్వాడీ టీచర్లపై అవమానుషంగా వ్యవహరిస్తున్నారని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు అడిగిన న్యాయమైన డిమాండ్స్ ను సత్వరమే పరిష్కరించే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలోని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి, తెల్లం రామలక్ష్మి, పుష్ప, భూదేవి, తదితరులు ఉన్నారు.