Sunday, February 15, 2026

Creating liberating content

Uncategorizedఅంకితభావంతో విధులు నిర్వహిస్తే గుర్తింపు

అంకితభావంతో విధులు నిర్వహిస్తే గుర్తింపు

హిందూపురం టౌన్
ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహిస్తే తప్పకుండా గుర్తింపు లభిస్తుందని స్థానిక అదనపు జిల్లా జడ్జి కం పల్లె శైలజ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి లు పేర్కొన్నారు బుధవారం స్థానిక సబ్ కోర్టు పర్యవేక్షణ అధికారిణి వెంకటరత్నమ్మ స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ కచ్చితంగా ఉంటుందన్నారు అయితే ఉద్యోగంలో ఉన్నంతకాలం ఎంత అంకితభావంతో పనిచేస్తే అంత గుర్తింపు వస్తుందన్నారు అదే తరహాలోనే సబ్ కోర్టు పర్యవేక్షణ అధికారిణి వెంకటరత్నమ్మ ఎంతో అంకితభావంతో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందాలని ప్రశంసించారు అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సుకుమార్ వివిధ కోర్టుల పర్యవేషణ అధికారులు ఆసిఫ్ రాధాకృష్ణ రామాంజనేయులు బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article