కనిగిరి:వైసీపీ నాయకుల కార్యకర్తల అభిమానుల సందడిలో శనివారం కనిగిరి సుదర్శన్ థియేటర్లో వ్యూహం చిత్ర ప్రదర్శన జరిగింది. కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు, ఇష్టంగా టికెట్లను పంపిణీ చేశారు. వైసిపి ఇన్చార్జ్ దద్దాల నారాయణ మాట్లాడుతూ సుదర్శన్ హాల్లో నాలుగు షోలు ఉచితంగా వ్యూహం సినిమా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. కావున కనిగిరి నియోజకవర్గం లోని ఆరు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు వైయస్సార్ అభిమానులు ఉచితంగా ఈ చిత్రాన్ని వీక్షించాలని అన్నారు. వ్యూహం చిత్ర ప్రదర్శన సందర్భంగా అభిమానులు భాణ సంసారాలు, మిఠాయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, వెలిగండ్ల ఎంపీపీ రామన తిరుపతిరెడ్డి , కనిగిరి జెడ్పిటిసి మడతల కస్తూరి రెడ్డి పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ ఏం చైర్మన్ సరితా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పులి శాంతి గోవర్ధన్ రెడ్డి, రామణ బోయిన శ్రీనివాసులు,తదితర కౌన్సిలర్లు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.