Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుకందికుంట సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మైనార్టీ నాయకులు

కందికుంట సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మైనార్టీ నాయకులు

కదిరి:కదిరి అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ స్వగృహంలో శనివారం ఆయన సమక్షంలో ఎన్.పి కుంట మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో ఖాదర్ వలి, అమానుల్లా, ముబారక్, షేక్ బాబ్ జాన్, చాంద్ బాషా, చిన్న అంజినేయులు, లోకేష్, షేక్ షబానా, రఘునాథ్ రెడ్డి, మస్కూద్, వెంకటరమణ తదితరులున్నారు. కందికుంట వారికి టీడీపీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి జరగాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పి.వి. పవన్ కుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు, సీనియర్ నాయకులు కెపి అంజినప్పనాయుడు, శ్రీరాములు నాయుడు, మండల క్లస్టర్ ఇన్చార్జ్ దండే రవి, పాలగిరి బాషా, మైనార్టీ మండల అధ్యక్షుడు షేక్ అజ్మతుల్లా, యువ నాయకులు దండే గంగశేఖర్, బీసీ సెల్ రవి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article