భారత్ తీసుకున్న చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అంతేకాకుండా తాను ప్రధానమంత్రిగా మూడోసారి భాగస్వామ్యం అయిన ఆరు నెలల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇపుడు పాకిస్థాన్‌కు పీవోకేను రక్షించుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. మహారాష్ట్రలోని పాల్టర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు కాపాడుకోవడం పాకిస్థాన్‌కు సంక్లిష్టంగా మారింది. మోడీని మూడోసారి ప్రధాని కానివ్వండి. ఆరు నెలల్లో పీవోకే భారత్‌లో భాగమవుతుంది. ఇలాంటి పని చేయాలంటే ధైర్యం ఉండాలి అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.