స్వయంగా వెళ్లి రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.

చంద్రగిరి:
చంద్రగిరినియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాలలో గత పాలకులు వచ్చిన పాపాన పోలేదు. ఆ ప్రాంతాలలో ఉన్న పంచాయతీలలో మౌలిక వసతులు కూడా పట్టించుకోలేదు.గత పాలకుడి నిర్లక్ష్యం మారుమూర ప్రాంతాల అభివృద్ధికికి నోచుకోలేదు. కానీ పులివర్తి నాని గెలిచిన 6 నెలలలోనే ఆ ప్రాంత వాసులు కనీ… వినీ… ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేబడుతున్నారు. అందులో భాగంగానే భాకరాపేట నుండి ఎలమందకు రోడ్డు విస్తరణ పనులుచేపట్టారు. పులివర్తి నాని స్వయంగా రోడ్ విస్తరణ పనులను స్థానిక నాయకులు అధికారులు తో కలసి పరిశీలించారు. అధికారులకు, కాంట్రాక్టర్ కు రోడ్డు విస్తరణ పనులలో నాణ్యత లోపించిన… అశ్రద్ధగా వ్యవహరించిన కాంట్రాక్టు పనులను రద్దు చేసేందుకు కూడా వెనకాడనని వారికి హెచ్చరికలు జారీ చేశారు . ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యతగా మెలిగి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.