Saturday, February 21, 2026

Creating liberating content

తాజా వార్తలువలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం: మంత్రి డోలా వీరాంజనేయస్వామి

వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం: మంత్రి డోలా వీరాంజనేయస్వామి

వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా? లేదా? అన్న సందిగ్ధతకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తెరదించింది. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రకటించారు. దీంతో 2 లక్షలమందికిపైగా ఉన్న వలంటీర్లు ఊపిరి పీల్చుకున్నారు.వలంటీర్ వ్యవస్థపై స్పష్టత ఇవ్వాలంటూ వైసీపీ నేత శివప్రసాద్‌రెడ్డి నిన్న సభలో ప్రభుత్వాన్ని కోరారు. దీనికి మంత్రి వీరాంజనేయులు సమాధానమిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలాగే, వారికి ఇస్తున్న గౌరవ వేతనం పెంపుపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు.నిజానికి నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. ఢిల్లీలో నిరసన కోసం వెళ్లారు. అయితే, అంతకుముందే వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సభకు నివేదించిన ప్రశ్నకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article