Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుఒక్క రోజులోనే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్..!

ఒక్క రోజులోనే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్..!

విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభకు ఎన్నికైన వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అయితే ఒక్క రోజు కూడా గడవకుండానే ఈ బ్రిడ్జ్ తెగిపోయింది. వంతెన చివరి భాగం సముద్రంలో కొంత దూరం కొట్టుకుపోయింది. అయితే, ప్రమాద సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం నేపథ్యంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైపు ఎవరూ వెళ్లకుండా భద్రతను ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ చేపట్టింది. జనవరి మొదటి వారంలో పనులను చేపట్టి చాలా వేగంగా పూర్తి చేశారు. రూ. 1.60 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. రెండో రోజే బ్రిడ్జ్ తెగిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article