విజయవాడలో ఇటీవల వచ్చిన భారీ వరద తర్వాత కొన్ని చోట్ల వరద నీరు వెళ్లిపోవడంతో ఇళ్లు, షాపులు, పరిసరాలు, సామాన్లు, దుస్తులను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు స్థానికులు. వరద నీటిలో మునిగి, తేలిన ఒక స్కూటీ ఓ ఇంటి ముందు ఉంది. ఒక కిరాణా షాపులో తడిసిపోయిన కందిపప్పు, మొక్కజొన్నలతో పాటు బస్తాలకొద్దీ ఆహార ధాన్యాలను , ఒక ఫ్యాన్సీ షాపును వరద నీరు ముంచెత్తడంతో అందులోని తడిసిపోయిన వస్తువులను బయట పడేశారు.

