పోరుమామిళ్ల:శ్రీ అవధూత కాశి నాయన మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గురువారం పాఠశాల యాజమాన్య విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగాయి.. ఏ గ్రామంలో కూడా ఎటువంటి సమస్యలు జరగకుండా టిడిపి సమన్వయకర్త రితీష్ రెడ్డి, విజయమ్మ ఆదేశాల మేరకు మండల క్లస్టర్ ఇంచార్జి బసిరెడ్డి రవీంద్రారెడ్డి ప్రతి గ్రామంలో పర్యటించి నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. టిడిపి తరపున నిలబడిన చైర్మన్ లను ఏకగ్రీవంగా గెలిపించుకుంటూ ప్రశాంతంగా ముగించారు. చైర్మెన్‌గా ఎన్నికైన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో టిడిపి తరఫున నిలబడిన చైర్మన్ లకు విద్యా కమిటీ మెంబర్లు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.. ప్రతి పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వచ్చిన వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

